ఖాద్రీ ఆలయం కిటకిట
కదిరి టౌన్: పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథసప్తమి సందర్భంగా ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో అర్చకులు ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఖాద్రీశుడు సూర్య ప్రభ వాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సర్వ జగత్తుకు వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణుడిని రథసప్తమి రోజున దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయనే విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. తరలివచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నదానం చేశారు.
ఖాద్రీ ఆలయం కిటకిట


