బాధితులకు అండగా ఉంటాం
● అక్రమాలకు సహకరించిన
అధికారులపై చర్యలు తప్పవు
● వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్
కదిరి టౌన్: కదిరి నడిబొడ్డున ముస్లింల భూమికి సంబంధించి బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలు పెరిగిపోతున్నాయన్నారు. కదిరిలో రూ. కోట్లు విలువ చేసే భూమిపై స్థానిక ప్రజాప్రతినిధి కన్ను పడిందన్నారు. పట్టణంలో మైనారిటీల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వెలిబుచ్చారు. జూనియర్ కళాశాల పక్కన ఉన్న భూమి విషయంలో బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష రూల్స్ చెప్పే అధికారులు ఇంత పెద్ద దందాలు జరుగు తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2029లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందని, తప్పుడు పనికి సహకరించిన అధికారులెవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కదిరి నడిబొడ్డున ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ఉన్న సర్వే నంబర్ 640–1లో 2.79 ఎకరాలు, 640–2 సర్వే నంబర్‌లో 3.20 ఎకరాలు కలిపి మొత్తం 5.99 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దని సూచించారు.
‘1915లోనే ఆస్తిని
కొనుగోలు చేశాం’
కదిరి టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ఉన్న భూమిని 1915లో ఫక్రోద్దిన్ అనే వ్యక్తి నుంచి తమ పూర్వీకులు సీతారామయ్య కొనుగోలు చేశారని ప్రభాకర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం కదిరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. భూమికి సంబంధించి డాక్యుమెంట్ నంబర్ 1943 అని, ఏమైనా అనుమానాలు ఉంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చూసుకోవచ్చని తెలిపారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపై దుష్ప్రచారం తగదన్నారు.
పేరూరు డ్యాం ఎత్తిపోతల పనులు ప్రారంభం
రామగిరి: అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు (పేరూరు డ్యాం) ఎత్తిపోతల పథకం పనులను ఎట్టకేలకు ఆదివారం ప్రారంభించారు. ఈ నెల 6న ‘సాక్షి’లో ‘నిధులి వ్వలేదు.. నీరూ తేలేదు’ శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్రమత్తమైన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి ఆత్మకూరు మండలం పంప్‌హౌస్–2 వద్ద పనులను ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాంకు సబ్ బ్రాంచ్ కాలువ పనుల కోసం రైతులతో భూ సేకరణ చేపట్టారు. కొద్దిమంది రైతులకే పరిహారం ఇవ్వడంతో పాటు కాలువ పనులు కొంతమేరకు జరిగిన విషయం తెలిసిందే. పనుల ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ఆగస్టులోపు కాలువ పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. రైతులకు త్వరలో నష్టపరిహారం అందిస్తామన్నారు.
బాధితులకు అండగా ఉంటాం
బాధితులకు అండగా ఉంటాం
బాధితులకు అండగా ఉంటాం


