
విద్యుత్ షాక్‌తో నెమలి మృతి
సోమందేపల్లి: మండలంలోని మరుకుంట సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ నెమలి మృతి చెందింది. శుక్రవారం వ్యవసాయ పొలాల్లో మేత కోసం వచ్చిన నెమలి అక్కడి విద్యుత్ స్తంభంపై కూర్చొనే క్రమంలో షాక్‌కు గురై కుప్పకూలి మృతి చెందింది. గమనించి రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
కిలో బంగారు ఆభరణాల సీజ్
తాడిపత్రి టౌన్: మండలంలోని కడప రోడ్డులో గురువారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో కిలో బరువున్న బంగారు నగలతో పాటు రూ.1.48 లక్షల నగదు పట్టుబడింది. సరైన అనుమతి పత్రాలు లేకుండా తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకు కారులో నగలు, నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరుకు చెందిన నగల వ్యాపారి ఉభయ్‌దుల్లాతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, దాదాపు 1,123.92 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,48,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు, నగదును కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.
తల్లి పాల ప్రాముఖత్యపై చైతన్య పరచండి
● ఐసీడీఎస్ పీడీ ప్రమీల
పుట్టపర్తి అర్బన్: తల్లి పాల ప్రాముఖ్యతపై మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ఐసీడీఎస్ పీడీ ప్రమీల అన్నారు. శుక్రవారం పుట్టపర్తి మండలం బీడుపల్లి–1 అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను ఆమె ప్రారంభించి, మాట్లాడారు. గ్రామంలోని పలువురు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కలిగించారు. శిశువు జన్మించిన అనంతరం రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా తల్లి పాలను కచ్చితంగా తాపాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనత నుంచి బయటపడవచ్చునన్నారు. అనంతరం నవజాత శిశువుల ఇళ్లకు వెళ్లి అంగన్‌వాడీ సేవలను తెలుసుకున్నారు. ఆకు కూరలు, కాయగూరలతో భోజనం చేయాలని సూచించారు. తల్లి పాల వారోత్సవాలకు గుర్తుగా రెండు ఇళ్ల వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీడీపీఓ జయంతి, సూపర్‌వైజర్ సుజాత, అంగన్‌వాడీ కార్యకర్తలు మంజుల, జ్యోతి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
రైల్వే క్వార్టర్స్‌లో చోరీ
రాయదుర్గం టౌన్: స్థానిక నూతన రైల్వే క్వార్టర్స్‌లో చోరీ జరిగింది. రైల్వే టీఆర్‌డీ (ట్రాక్షన్ అండ్ రిసోర్స్ డెవలప్‌మెంట్) వర్కర్‌గా పనిచేస్తున్న నాగేంద్ర ఇంత కాలం తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి క్వార్టర్స్‌లో కేటాయించిన నూతన ఇంటికి గురువారం మొత్తం సామగ్రిని తరలించారు. అనంతరం శుక్రవారం నూతన గృహంలో చేరాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అద్దె ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలసి నిద్రించారు. ఇదే అదనుగా భావించిన దుండగులు క్వార్టర్స్‌లోని ఇంటి తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బ్యాగుల్లోని బంగారు, వెండి సామగ్రితో పాటు కొంత మేర నగదు అపహరించారు. శుక్రవారం ఉదయం నూతన గృహంలో పూజాదికాలు చేసేందుకు సిద్ధమై వచ్చిన నాగేంద్ర కుటుంబసభ్యులు చోరీ విషయాన్ని గుర్తించి ఆందోళనకు గురయ్యారు. మొత్తం రూ.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు అపహరించినట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విద్యుత్ షాక్‌తో నెమలి మృతి