
●బయటపడిన డొల్లతనం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్, బూట్లు, ఇతర సామగ్రి ఏటా ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ఈ పథకంతో భారీగా ప్రజాధనం వృథా అవుతోందని, నాసిరకం కిట్లను పంపిణీ చేస్తున్నారని అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన కిట్‌ను అందజేస్తామని గొప్పలకు పోయారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థులకు అందజేసిన కిట్లలోని డొల్లతనం కాస్త బయటపడింది. విద్యార్థులకు అందజేసిన బ్యాగ్‌లు రెండంటే రెండే రోజుల్లో చిరిగిపోయి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

●బయటపడిన డొల్లతనం