
కూటమి మోసాన్ని వివరిద్దాం
గోరంట్ల: కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షరాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. వారి మోసాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి క్యూఆర్‌కోడ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గురువారం మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మండల పరిధిలోని గడ్డం తండా, మందలపల్లి, కరావులపల్లి తండా, గంగంపల్లి, వెంకటరమణపల్లి , పులేరు గ్రామాల్లో నిర్వహించిన చద్రబాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లినట్లు , కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప పారిశ్రామిక వేత్తలు మాత్రం ముందుకు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయంలో కొత్త పరిశ్రమలు వచ్చే సంగతి పక్కనపెడితే అధికార పార్టీ నాయకుల అరాచకాల మూలంగా ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి నెలకొందన్నారు. కియా పరిశ్రమపై తమ్ముళ్లు చేసిన దౌర్జన్యకాండను కప్పి పుచ్చుకునేందుకు అధికార పార్టీ నాయకులు నీచ రాజకీయలు చేస్తున్నారన్నారు. మంత్రి సవిత గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో గ్రామాల్లో మద్యానికి ప్రజలు బానిసలయ్యారని ఆరోపించారని, అయితే ఆమె భర్త వెంకటేశ్వరరావు గ్రామాల్లో మద్యం బెల్టుషాపులు ప్రారంభించడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు.నియోజకవర్గంలోని అన్ని కంకర మిషన్ల యాజమానులను సవిత, ఆమె అనుచరులు బెదిరించి ఇష్టారాజ్యంగా కంకర అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. మండల కన్వీనర్ వెంకటేష్, జెడ్పీటీసీ సభ్యుడు పాలేజయరాంనాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, ట్రెజరర్ బాలన్నగరిపల్లి రామకృష్ణారెడ్డి, టౌన్ కన్వీనర్ శంకర, మాజీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, మండల మహిళా కన్వీనర్ కవిత పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్