సెంట్రల్‌లో సరికొత్త కోర్సులు | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌లో సరికొత్త కోర్సులు

Jun 17 2025 4:52 AM | Updated on Jun 17 2025 4:52 AM

సెంట్

సెంట్రల్‌లో సరికొత్త కోర్సులు

అనంతపురం: నాణ్యమైన ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా నిలిచిన అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో సరికొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా 14 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందే అవకాశముంది. ఇప్పటికే సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రెస్‌ టెస్ట్‌ (సీయూ సెట్‌)కు గడువు ముగిసింది. అయితే సీయూ సెట్‌ ద్వారా సీట్లు భర్తీ కాగా, మిగులు సీట్ల భర్తీని వర్సిటీనే స్వతహాగా ఓ ప్రవేశ పరీక్ష నిర్వహించి చేపడుతుంది.

క్యాంపస్‌ కళాశాలలో డిగ్రీ కోర్సులు..

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో 9 యూజీ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. బీఏ ఆనర్స్‌ కింద పొలిటికల్‌ సైన్సెస్‌ విభాగంలో 40 సీట్లు, ఇంగ్లిష్‌ విభాగంలో 25, బీబీఏలో 60, బీకాం ఆనర్స్‌లో 40, బీఎస్సీ ఆనర్స్‌ కింద ఎకనామిక్స్‌ విభాగంలో 25, ఆర్‌ఎంఐటీలో 25, సైకాలజీలో 30, సీఎస్‌ అండ్‌ ఏఐలో 60, బీటెక్‌ (సీఎస్‌ఈ)లో 60 సీట్లు భర్తీ చేస్తారు. ఇక పీజీలో ఎంఏలో ఇంగ్లిష్‌ విభాగానికి 30 సీట్లు, హిందీ విభాగానికి 20, గవర్నెన్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీలో 20, పొలిటికల్‌ సైన్సెస్‌లో 30, తెలుగులో 20 సీట్లు కేటాయించారు. అలాగే ఎంబీఏకు 60, ఎంకాంలో 20, ఎమ్మెస్సీలో అప్‌లైడ్‌ సైకాలజీ విభాగంలో 40, ఏఐ అండ్‌ డీఎస్‌లో 40, క్లినికల్‌ సైకాలజీ విభాగంలో 25, కంప్యూటేషనల్‌ సోషల్‌ సైన్స్‌లో 20, ఎకనామిక్స్‌లో 20, ఎకనామిక్స్‌ అండ్‌ డేటా అనాలసిస్‌లో 20, జియాగ్రఫీలో 25, మేథమేటిక్స్‌లో 30, మాలుక్యులార్‌ బయాలజీలో 30, స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సీట్లు అందుబాటులో ఉంటాయి. పీహెచ్‌డీకి సంబంధించి పొలిటికల్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సు, తెలుగు, ఇంగ్లిష్‌, సైకాలజీ కోర్సులు ఉన్నాయి. పీహెచ్‌డీని ఆన్‌లైన్‌ ద్వారా పూర్తి చేసే సౌలభ్యం కూడా ఉంది.

గతేడాది 23 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు..

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ చట్టంలో భాగంగా 2018లో అనంతపురం కేంద్రంలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కాగా, ప్రస్తుతం బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద 491 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో శాశ్వత క్యాంపస్‌ను నెలకొల్పారు. రెండు అకడమిక్‌ బ్లాక్‌లు, ఒక అడ్మినిస్ట్రేటీవ్‌ బిల్డింగ్‌, రెండు బాయ్స్‌, ఒక గర్‌ల్స్‌ హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయి. ఓ ఎలక్ట్రిక్‌ సబ్‌ స్టేషన్‌, మరో సోలార్‌ పార్క్‌తో ఆరు జోన్లలో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటైంది. ప్రస్తుతం 2,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చిన ప్రొఫెసర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. 75 మంది ప్రొఫెసర్లలో 50 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. గతేడాది 23 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. యూపీఎస్సీ ఉచిత కోచింగ్‌ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తుండడంతో ఇక్కడి సెంట్రల్‌ యూనివర్సిటీలో చేరేందుకు పలువురు విద్యార్థులు పోటీ పడుతుంటారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో భాగంగా ఇప్పటికే ఇక్కడ చదువుకున్న 160 మంది విద్యార్థులకు పలు కంపెనీల్లో కొలువులు దక్కాయి.

కొత్తగా డిప్లొమా కోర్సులు..

సెంట్రల్‌ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా 15 డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏడాది కాల వ్యవధి ఉన్న డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

సరికొత్త కోర్సులకు రూపకల్పన

సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా సరికొత్త కోర్సులకు రూపకల్పన చేశాం. డిప్లొమాలో 15 కోర్సులు అందుబాటులోకి తెచ్చాం. యూజీలోనూ బీటెక్‌, ఏఐ కోర్సులు ఉన్నాయి. పీజీలోనూ సరికొత్త కోర్సులు తీసుకొచ్చాం. గతేడాది 23 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే ఒరవడి కనిపిస్తోంది. – ఎస్‌.ఎ.కోరి, వీసీ,

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ

డిప్లొమా కోర్సుల వివరాలు..

కంప్యూటేషనల్‌ సోషల్‌ సైన్సెస్‌

జియో– స్పేషియల్‌ ఇన్ఫర్మేటిక్స్‌

బయో ఇన్‌ఫర్మెటిక్స్‌ అండ్‌ డేటా సైన్సెస్‌

పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ స్టడీస్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌

కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌ (ట్యాలీ ఈఆర్‌పీ) విత్‌ జీఎస్టీ ఫైలింగ్‌

సైబర్‌ సెక్యూరిటీ

గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ మేనేజ్‌మెంట్‌

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌

బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ ఎకనామెట్రిక్స్‌

మేథమేటికల్‌ ఫౌండేషన్స్‌ ఫర్‌ మెషిన్‌ లర్నింగ్‌ అండ్‌ డేటా సైన్సెస్‌

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌

సెమి– కండక్టింగ్‌ టెక్నాలజీ

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌

డిజైన్‌ థింకింగ్‌

ఈ విద్యా సంవత్సరం నుంచి

నూతనంగా 15 డిప్లొమా కోర్సులు

ఇప్పటికే ముగిసిన సీయూ సెట్‌

మిగులు సీట్ల భర్తీకి మరో అవకాశం

జూలై చివరి వరకూ ప్రవేశాలకు గడువు

యూజీలో 9, పీజీలో 17 కోర్సులు

అందుబాటులోకి

ఆరు విభిన్న కోర్సుల్లో

పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం

సెంట్రల్‌లో సరికొత్త కోర్సులు 1
1/1

సెంట్రల్‌లో సరికొత్త కోర్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement