
రీసర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలి: జేసీ
ప్రశాంతి నిలయం: భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రీ సర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్‌ఎస్, రీ సర్వే అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో జిల్లాలోని 32 గ్రామాల్లో చేపట్టిన సర్వే పనులు ఎలా జరుగుతున్నాయో సంబంధిత ఆర్డీఓలు పరిశీలించాలన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు బృందాలుగా ఏర్పడి రీసర్వే పూర్తి చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఐకాన్ యూత్’ సదస్సుకు మదీహ
హిందూపురం టౌన్: ‘భవిష్యత్ భారతావని యువత ముందున్న సవాళ్లు’ అనే అంశంపై మంగళూరులోని యెన్ఫోయా విశ్వవిద్యాలయంలో వేదికగా ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే అంతర్జాతీయ సదస్సు ‘ఐకాన్ యూత్ 2025’కు హిందూపురంలోని ఎస్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎ.మదీహ ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి సోమవారం తెలిపారు. రాష్ట్రం తరఫున నలుగురు పాల్గొంటుండగా...అందులో తమ కళాశాల విద్యార్థి కూడా ఉండటం గర్వకారణమన్నారు. ‘ఆధునిక యుగంలో ప్రజారోగ్య ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించడంలో యువత పాత్ర’ అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ రూపంలో మదీహ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సెమినార్‌కు ఎంపికై న విద్యార్థినిని కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మీ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి రంగనాయకులు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సహచర విద్యార్థులు అభినందించారు.
‘పోలీసు స్పందన’కు 70 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి అర్బన్ డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ పాల్గొన్నారు.

రీసర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలి: జేసీ

రీసర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలి: జేసీ