వైఎస్సార్సీపీ మాత్రం ముందుగానే తన అభ్యర్థి ని ప్రకటించి రాజకీయంగా పైచేయి సాధించింది. నెల్లూరు మేయర్ అభ్యర్థి గా ఆనం విజయకుమార్రెడ్డిని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నగర రాజకీయాల్లో సుపరిచితుడైన ఆనం విజయకుమార్రెడ్డి పేరును ముందుగానే ఖరారు చేయడం ద్వారా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యే అవకాశం వైఎస్సార్సీపీకి లభించింది. కూటమి లో అభ్యర్థి ఎంపికపై రోజుకో ఊహాగానం, నేతల మధ్య ఎడతెగని చర్చలు కొనసాగుతుండగా, వైఎస్సార్సీపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించి ప్రచారానికి సిద్ధమవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.


