అక్రమ కేసులో విచారణకు ప్రసన్న | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులో విచారణకు ప్రసన్న

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

కోవూరు/నెల్లూరు(లీగల్‌): మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ వీరి చలపతిరావు గురువారం నెల్లూరు జిల్లా 5వ అదనపు జిల్లా కోర్టుకు (ఎస్సీ, ఎస్టీ) హాజరయ్యారు. వీరితోపాటు మరో 18 మంది నాయకులపై నమోదైన కేసు విచారణ నేపథ్యంలో వచ్చారు. 2025 సెప్టెంబర్‌ 20వ తేదీన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమపై అక్రమంగా కేసులు నమోదు చేశారని నాయకులు ఆరోపించారు. తదుపరి కేసు విచారణ 2027 సంవత్సరం జనవరి 5వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు ప్రాంగణంలో ప్రసన్నను ఆ పార్టీ లీగల్‌ సెల్‌ నాయకులు, న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో లీగల్‌ సెల్‌ జోనల్‌ అధ్యక్షుడు రామిరెడ్డి రోజారెడ్డి, కె.చంద్రశేఖర్‌, వై.బ్రహ్మతేజ, ఎ.శ్రావణ్‌కుమార్‌, రమాదేవి, బలంరెడ్డి చెంచురెడ్డి, గోమటం శ్యామాచార్యులు, సీహెచ్‌ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement