వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాల్లో నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా గూడూరు నియోజకవర్గానికి చెందిన పల్లి కోటేశ్వరరావు, బీసీ సెల్‌ జనరల్‌ సెక్రటరీగా నెల్లూరు సిటీకి చెందిన సి.నాగరాజు, ఉదయగిరి నియోజకవర్గ సోషల్‌ మీడియా వింగ్‌ ప్రెసిడెంట్‌గా షేక్‌ జిలానీబాషా, కావలి నియోజకవర్గం బోగోలు మండల అధ్యక్షుడిగా ఉప్పాల మాచర్ల, ఉపాధ్యక్షుడిగా ఏకే సుందరరాజ్‌ నియమితులయ్యారు.

మత్తులో బిడ్డను

వదిలేసిన తండ్రి

● స్థానికులు, పోలీసుల చొరవతో రక్షణ

సంగం: ఓ వ్యక్తి మద్యం మత్తులో ఎనిమిది నెలల కన్నబిడ్డను కాలువ పక్కన చెత్తలో వదిలేసిన ఘటన సంగంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో చిన్నారిని సంరక్షించారు. అనంతరం అధికారులు బిడ్డను మేనత్తకు గురువారం అప్పగించారు. వారి కథనం మేరకు.. సంగంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో కామాక్షయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో తన ఎనిమిది నెలల బిడ్డను కాలువ పక్కన చెత్తలో వదిలేశాడు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక వ్యాపారి కోటారెడ్డి వెంటనే పాలు తీసుకొచ్చి చిన్నారికి పట్టించాడు. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్‌ పోలీసులను అక్కడికి పంపించారు. స్థానికుల సహకారంతో బిడ్డను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు పరీక్షించి సంరక్షణ అందించారు. ఐసీడీఎస్‌ అధికారులు, అంగన్‌న్‌వాడీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్న చిన్నారిని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చైల్డ్‌ హోమ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బిడ్డ మేనత్త వనమ్మ అక్కడికి చేరుకోవడంతో అధికారులు తగిన ప్రక్రియ అనంతరం ఆమెకు అప్పగించారు. బిడ్డను రక్షించి సంరక్షించిన పోలీసులకు, వైద్య సిబ్బందికి, ఐసీడీఎస్‌ అధికారులకు వనమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘన

● రూ.4.40 లక్షల జరిమానా

నెల్లూరురూరల్‌: జిల్లాలో ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నమోదు చేసిన కేసులను విచారించిన జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు బాధ్యులైన వ్యాపారులకు మొత్తం రూ.4.40 లక్షల జరిమానా విధించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. ఐస్‌క్రీమ్‌ సెంటర్లలో ఫ్యాట్‌ శాతం నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా ఉండటంతో సంబంధిత దుకాణాల యజమానికి జరిమానులకు వేశారు. పాలసేకరణదారులు, చిల్లింగ్‌ సెంటర్ల నిర్వహణకు సంబంధించి కూడా రూ.1.35 లక్షలు జరిమానా విధించారు. తయారీదారు వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ, లైసెన్స్‌ నంబర్‌, చిరునామా తప్పనిసరిగా స్పష్టంగా ముద్రించాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జి.వెంకటేశ్వరరావు, అధికారులు ఎం.ప్రణతి ఫ్లోరా, డి.నీరజ పాల్గొన్నారు.

కండలేరులో

16.914 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 16.914 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 60, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement