● కావలి మాజీ ఎమ్మెల్యే
రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి
● వైఎస్సార్సీపీలోకి ఏబీ కండ్రిక
టీడీపీ నేతలు
కావలి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు గుణపాఠం చెప్పబోతున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. బోగోలు మండలం ఏబీ కండ్రిక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం పెద్దఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రామిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి కండువాలు కప్పారు. పార్టీలో చేరిన వారిలో ఏబీ కండ్రిక పంచాయతీ టీడీపీ బూత్ ఇన్చార్జి సాదనాల మల్లికార్జున, మాజీ సర్పంచ్ బత్తల శ్రీనివాసులు, వర్దినేని నరేంద్ర, బత్తల మహేంద్ర, గునపాటి చిరంజీవిరెడ్డి, డమ్ము అంకయ్య పలువురు నేతలు, కార్యకర్తలున్నారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన మంచిని గుర్తించి నేడు అనేకమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలను నమ్మి పల్లెప్రజలు మోసపోయారన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బోగోలు మండలాధ్యక్షుడు మాచర్ల, మాజీ అధ్యక్షుడు మద్దిబోయిన వీరరఘు తదితరులు పాల్గొన్నారు.


