స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

● గూడూరు సమన్వయకర్త గురవయ్య

చిట్టమూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను చిట్టమూరు మండలంలో ఎగురవేయాలని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య పిలుపునిచ్చారు. గునపాటిపాళెంలో మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో అనుబంధ కమిటీల నాయకులకు గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ కమిటీలతోపాటు పార్టీ అందించే ఐడీకార్డులు అందుకున్న వారికి భవిష్యత్‌లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే రూ.5 లక్షలు ప్రమాద బీమాను కల్పిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో చిన్న పొరపాటు కూడా లేకుండా విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. మండలంలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీలు, 23 సర్పంచ్‌లను గెలిపించుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. వివాదాలు సృష్టించాలని చూసే వారికి తగిన విధంగా ఓటుతో గుణపాఠం చెప్పాలని అన్నారు. అధికార పార్టీ ఎన్నికల్లో ఇబ్బందులు సృష్టిస్తే పార్టీతోపాటు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరిగ రేవంత్‌ చక్రవర్తి, నాయకులు కామిరెడ్డి కస్తూరిరెడ్డి, చెన్నారెడ్డి బాబురెడ్డి, బీవీ రమణయ్య, అనిల్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, అనపల్లి గోపి, ముత్తుకూరు దీనబందు, వైసీ పుట్టబాబు, దేవారెడ్డి సుధాకర్‌రెడ్డి, సంక్రాంతి కస్తూరయ్య, గొట్టికాటి రవీంద్రరెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement