వైఎస్సార్‌సీపీలో 400 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో 400 కుటుంబాల చేరిక

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

నెల్లూరురూరల్‌: నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నాయకులు, వారి అనుచరులైన 400 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం స్థానిక సిటీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్‌ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. టీడీపీ నాయకుడు ముజీర్‌, 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ షఫీయా బేగం అనుచరులు 300 కుటుంబాలు, యలమందరెడ్డి అనుచరులు 100 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకోగా వారికి నేతలు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత ప్రాధాన్యం, గౌరవం కల్పిస్తామని తెలిపారు. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో నెల్లూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వరరెడ్డి, 14వ డివిజన్‌ ఇన్‌చార్జి గిరిరెడ్డి, 53వ డివిజన్‌ ఇన్‌చార్జి వెంగళరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement