టిఫిన్‌ చేసేందుకు వెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

టిఫిన్‌ చేసేందుకు వెళ్తుండగా..

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

● గుర్తుతెలియని వాహనం ఢీకొని

దంపతులకు గాయాలు

● చికిత్స పొందుతూ భర్త మృతి

● కావలి హైవేపై ఘటన

కావలి: జాతీయ రహదారిపై కావలి సమీపాన తుమ్మలపెంట ఫ్లై ఓవర్‌ వద్ద బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని కావలి పట్టణ మానికలవీధికి చెందిన డి.వంశీకృష్ణారెడ్డి (30), అతని భార్య గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. కావలి రూరల్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భార్యాభర్తలిద్దరూ రాత్రివేళ హైవేపై ఉన్న ఓ హోటల్లో టిఫిన్‌ చేసేందుకు స్కూటీపై బయలుదేరారు. కాగా హైవేపై కారు పెట్రోల్‌ అయిపోవడంతో ఆగి ఉంది. సాయం కోసం ఎదురుచూస్తుండగా స్కూటీపై వెళుతున్న భార్యాభర్తలు ఆగి వివరాలు తెలుసుకున్నారు. దీంతో వారు పెట్రోల్‌ తీసుకొచ్చి ఇచ్చి కారు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. వారిని అంబులెన్స్‌లో కావలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వంశీకృష్ణారెడ్డి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. భార్య ప్రవళ్లిక గురువారం కావలి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement