కావలి బస్టాండ్‌లో తప్పిపోయిన బాలుడు | - | Sakshi
Sakshi News home page

కావలి బస్టాండ్‌లో తప్పిపోయిన బాలుడు

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

● వేగంగా స్పందించిన పోలీసులు

● తల్లిదండ్రులకు అప్పగింత

కావలి: ఓ బాలుడు తప్పిపోగా విషయం తెలుసుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. బాలుడి పట్టుకుని బాధిత తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన కావలిలో గురువారం చోటుచేసుకుంది. ఒకటో పట్టణ సీఐ రంగనాథ్‌గౌడ్‌ కథనం మేరకు.. దుత్తలూరు మండలం రాచవారిపల్లెకు చెందిన నాగరాజు, దివ్య దంపతులు విజయవాడ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు కావలి ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు దిగారు. ఉదయగిరికి వెళ్లే బస్సు కోసం వేచి ఉన్నారు. కాగా నాగరాజు తాగునీటి కోసం పక్కకు వెళ్లగా ఐదేళ్ల కుమారుడు హేమసుభాన్‌ తండ్రిని అనుసరించాడు. నాగరాజు ఈ విషయాన్ని గమనించలేదు. తిరిగి వచ్చి చూడగా బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు బస్టాండ్‌ ఓపీలో ఫిర్యాదు చేశారు. వెంటనే కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు తెలియజేశాడు. సీఐ రంగనాథ్‌గౌడ్‌ రంగంలోకి దిగి వివరాలను సేకరించారు. ఆర్టీసీ అధికారులతో కలిసి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. బాలుడు ఒంగోలు వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించారు. అప్పటికే అది 30 కిలోమీటర్లు వెళ్లిపోయింది. ఆర్టీసీ అధికారులు బస్సును వెనక్కి రప్పించారు. తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. సమావేశంలో ఎస్సై సుమన్‌, హెడ్‌కానిస్టేబుల్‌ కె.మాలకొండయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement