వైద్య కళాశాలలో అనాటమీ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాలలో అనాటమీ దినోత్సవం

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

నెల్లూరు(అర్బన్‌): నెల్లూరు దర్గామిట్టలోని ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ అనాటమీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బెన్‌హర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. వైద్య విద్యార్థులు మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నాణ్యమైన వైద్య సేవలకు అనాటమీ పునాది అన్నారు. అనాటమీ విభాగాధిపతి డాక్టర్‌ రాధిక మాట్లాడుతూ వైద్య విద్యార్థుల అభ్యసనానికి తమ దేహాలను దానం చేసే దాతల త్యాగం ఎంతో గొప్పదన్నారు. దేహదాతల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోస్టర్‌ ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాధవి, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్‌ హెలీనారాజకుమారి, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సుజాత, అసోసియేట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ శ్రీకాంత్‌రావు, డాక్టర్‌ శ్రావణి, పీజీ విద్యార్థులు, ఎంబీబీఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement