నెల్లూరు(వీఆర్సీసెంటర్): భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్న రూ. 4,500 కోట్ల నిధులను కార్మికుల సంక్షేమానికి అందించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్న ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో 7 కోట్ల మంది కార్మికులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులను ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందినా, అంగవైకల్యానికి గురైనా ప్రమాద బీమా కింద రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డులోని రూ.4,500 కోట్ల నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. చలో కలెక్టరేట్ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆవుల పెంచలయ్య, రఫీ, మహేష్, అఫ్రోజ్, హరి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
గేదెలను ఢీకొన్న కారు
సీతారామపురం: మండలంలోని చిన్నాగంపల్లి చెరువుకట్టపై మంగళవారం రాత్రి కారు గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా నాలుగు గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా వరికుంటపాడు మండలంలో విధులకు హాజరైన పోలీసులు వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు వెళ్తుండగా మార్గమధ్యలో చిన్నాగంపల్లి చెరువు కట్టపై అడ్డొచ్చిన నాలుగు గేదెలను ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.125 సన్నవి : రూ.90
పండ్లు : రూ.40


