వెంకటాచలం: మండలంలోని కసుమూరులో మస్తాన్‌వలీ దర్గా చిన్న గంధం మహోత్సవాన్ని గురువారం వేడుకగా నిర్వహించారు. చందన్ మహాల్ నుంచి ఉదయం 9 గంటలకు ముజావర్లు గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. 11 గంటలకు గంధం దర్గా ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం మస్తాన్‌వలీ సమాధి వద్ద తహలీల్, ఫాతెహా నిర్వహించి గంధాన్ని సమాధికి పూశారు. తర్వాత దర్గా ముజావర్లు గంధం, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. దీంతో కసుమూరు మస్తాన్‌వలీ 249వ గంధ మహోత్సవాలు ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకున్నారు.


