నడుచుకుంటూ ఇంటికెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

నడుచుకుంటూ ఇంటికెళ్తుండగా..

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

మినీ ట్రక్కు ఢీకొని వ్యక్తి మృతి

సీతారామపురం: మండలంలోని బోడసిద్ధాయపల్లి గ్రామ రోడ్డు సెంటర్‌లో మినీ ట్రక్కు ఢీకొని అదే గ్రామానికి చెందిన భూమనబోయిన నాగరాజు (36) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నాగరాజుకు వివాహమై పిల్లలున్నారు. హైరర్స్‌ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నాగరాజు బోడసిద్ధాయపల్లి గ్రామ రోడ్డు సెంటర్‌లోని జాతీయ రహదారిపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. మినీ ట్రక్కు మైదుకూరులో కూరగాయలు తీసుకుని మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురంలో అన్‌లోడ్‌ చేసి తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో నాగరాజును ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement