గూడూరురూరల్: ఆదిశంకర కమ్యూనిటీ ఇంకుబేషన్ సెంటర్ (ఏసీఐసీ), అటల్ ఇన్నోవేషన్ మిషన్ (నీతి ఆయోగ్)లో ఇంకుబేషన్ పొందుతున్న భారత్ ఆల్ట్ ఫ్యూయెల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి విప్లవాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఓఆర్‌బీ–ఈ’కి డిజైన్‌కు పేటెంట్‌ను అధికారికంగా మంజూరు చేసినట్లు ఆదిశంకర డీమ్డ్ టు బీ యూనివర్సిటీ చాన్సలర్ అరవింద వంకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టార్టప్‌లు, అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరణలు చేయగలవని ఈ పేటెంట్ నిరూపిస్తోందన్నారు. దీని ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సహించే మేక్ ఇన్ ఇండియా దృష్టిని బలంగా ధ్రువపరుస్తోందన్నారు. ఓఆర్బీ–ఈను ఆధునిక డిజైన్‌తో పట్టణ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఆదిశంకర ఏసీఐసీ కేంద్రం ద్వారా మొబిలిటీ, క్లీన్‌టెక్, అధునాతన ఇంజినీరింగ్ రంగాల్లో స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఆదిశంకర చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య ప్రారంభించిన ఈ సదుపాయం ద్వారా నూతన ఆవిష్కరణలకు, భారతీయ తయారీ రంగానికి మద్దతు అందిస్తున్నట్లు తెలియజేశారు.


