108 అంబులెన్స్‌ల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

108 అంబులెన్స్‌ల తనిఖీ

Jun 17 2026 12:10 AM | Updated on Jun 17 2026 12:10 AM

నెల్లూరు(అర్బన్‌): భవ్య హెల్త్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్‌ మోహన్‌బాబు మంగళవారం నెల్లూరులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంతోపాటు రూరల్‌ ప్రాంతాల్లో వాహనాలను చూశారు. పైలట్లకు సూచనలిచ్చారు. రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చాలని పేర్కొన్నారు. గుండెపోటు కేసులకు సంబంధించి గోల్డెన్‌ అవర్‌గా పేర్కొనే మొదటి గంటలోనే ఆస్పత్రికి చేర్చితే వారికి చికిత్స అందుతుందన్నారు. వాహనాల్లో ఉన్న పరికరాలు, టెక్నాలజీని పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ సుజాత, ఎన్టీఆర్‌ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ను కలిసి రోగులకు 108 వాహనాల ద్వారా మెరుగైన వసతులు కల్పించే విధానం గురించి చర్చించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement