ఉదయగిరి: రెండేళ్ల కూటమి పాలనంతా స్కామ్‌లు, మోసాలే తప్ప ప్రజలకు చేసిన మేలేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా పట్టణంలో భారీ ర్యాలీని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. యువనేత మేకపాటి అభినవ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు, నల్ల కండువాలను ధరించి నిరసన ర్యాలీకి హాజరయ్యారు. ట్యాంక్ బండ్ నుంచి పంచాయతీ బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీని జరిపారు. అనంతరం బస్టాండ్ సెంటర్‌లో టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి.. ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు.


