మావిగన్‌పై చర్చకు సిద్ధమా..? | - | Sakshi
Sakshi News home page

మావిగన్‌పై చర్చకు సిద్ధమా..?

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

మర్రిపాడు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన రాజధాని మావిగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఆత్మకూరులో ఎన్నికలు పెడితే.. మీరో.. మేమో ప్రజలే చెప్తారనీ.. అభివృద్ధిపై ముందు దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి హితవు పలికారు. మండలంలోని పల్లవోలు పంచాయతీ తిక్కవరంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లో 90 శాతం పనులను నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేయించి.. ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారని, అయితే మిగిలిన పది శాతం పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయకుండానే ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నద్ధమైందని ఆరోపించారు. ఇలా అయితే హార్బర్‌లో ఏమి చేయాలన్నా.. అక్కడి మౌలిక వసతులను వినియోగించుకోవాలన్నా, ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద మత్స్యకారులు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. దీన్ని ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టొద్దని డిమాండ్‌ చేశారని, స్థానిక మత్స్యకారులకు నష్టం కలిగేలా ఎవరు యత్నించినా, రానున్న తమ ప్రభుత్వం ఊరుకోబోదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తమ స్వలాభం కోసమే ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీటన్నింటినీ మంత్రి ఆనం పక్కనబెట్టి.. మావిగన్‌లో ఒక అంశాన్ని తీసుకొని జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి అధికారంలోకి రారంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆత్మకూరులో ఎన్నికలను ఇప్పుడు నిర్వహిస్తే, ఎవరు గెలుస్తారో తెలుస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో అనేక రకాల మాఫియాలున్నాయని.. ఇసుక, మట్టి మాఫియా విజృంభిస్తోందని మండిపడ్డారు. ప్రతి మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉందని ఆరోపించారు. ఇలా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణిస్తే, కారకులపై నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. సోమశిల జలాశయ పనులు జరగలేదని.. ఆప్రాన్‌ వర్కులను చేపట్టకపోతే భారీ నష్టం సంభవిస్తుందంటూ గతంలో చెప్పిన ఆనం.. అధికారంలోకి వచ్చాక ఒక్క అంగు ళం పనిని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించా రు. హైలెవల్‌ కెనాల్‌ విషయంలోనూ ఇదే పరిస్థితని, ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ముందు దృష్టి సా రించాలని సూచించారు. అన్ని అంశాలను ప్రజలు గ మనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన సమాధానం చెప్తారని స్పష్టం చేశారు. పార్టీ మండల కన్వీనర్‌ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు శ్రీనివాసులునా యుడు, బొర్రా సుబ్బిరెడ్డి, బాబునాయుడు, శ్రీను, నారాయణస్వామి, సుధాకర్‌ పాల్గొన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు మాని.. అభివృద్ధిపై దృష్టి సారించండి

మత్స్యకారుల కోసమే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement