Womens u19 world cup 2023: అమెరికా జట్టు వైస్‌ కెప్టెన్‌గా అనికా.. మూలాలు మనవే

Womens u19 world cup 2023: kolan anika appointed america team vice captain - Sakshi

కీసర: దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే నెలలో జరగనున్న అండర్‌– 19 టీ 20 ప్రపంచకప్‌ పోటీలకు అగ్రరాజ్యం అమెరికా జట్టు తరఫున తెలంగాణ మూలాలు ఉన్న కొలన్‌ అనిక వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి చెందిన ముప్పు సత్తిరెడ్డి కూతురు కొలన్‌ మంజుల, అల్లుడు సురేష్‌రెడ్డి అమెరికాలో పదేళ్ల క్రితమే స్థిరపడ్డారు.

మంజుల వైద్యురాలు కాగా.. సురేష్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. 8 ఏళ్ల వయసులోనే క్రికెట్‌పై ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తమ కూతురు అనికకు శిక్షణ ఇప్పించారు. ఆమె క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటూ వివిధ టోర్నమెంట్లలో సత్తా చాటుకుంది. 17 ఏళ్ల అనిక అమెరికాలో పదో తరగతి చదువుతోంది.

అండర్‌ –19 టీ20 ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీలకు అమెరికా జట్టు వైఎస్‌ కెప్టెన్‌గా తమ కూతురు ఎంపికవ్వడంపై అనిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారని బంధువులు తెలిపారు. కాగా.. అమెరికా రెగ్యులర్‌ టీమ్‌లో వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌గా అనిక రాణిస్తోంది. నాగారంలో ఉంటున్న అనిక తాతయ్య ముప్పు సత్తిరెడ్డి, మేనమామ అశోక్‌రెడ్డిలు మాట్లాడుతూ.. అనిక మూడు నెలల క్రితం అమెరికా నుంచి నాగారానికి వచ్చిందన్నారు.

నెల రోజుల పాటు  సికింద్రాబ్‌ సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకుందన్నారు. అమెరికా జట్టు తరఫున అండర్‌ – 19 టీ 20 ప్రపంచ కప్‌ పోటీలకు తన మనవరాలు ఎంపికై వైస్‌కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తుండటంపై సత్తిరెడ్డితో పాటు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం
చేస్తున్నారు.
చదవండి: IND vs BAN 1st Test: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top