అనుష్క పోస్ట్‌పై గావస్కర్‌ స్పందన

Where am I Blaming Anushka For Virat Kohlis Failures, Gavaskar - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభమై వారం రోజులు గడవకముందే వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో షార్ట్‌ రన్‌ వివాదం ఒకటైతే, ఇప్పుడు బాలీవుడ్‌ నటి, విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మను దిగ్గజ క్రికెటర్‌, కామెంటేటర్‌ సునీల్‌ గావస్కర్‌ టార్గెట్‌ చేసి వ్యాఖ్యలు చేశాడనే  వివాదం మరొకటి. గురువారం ఆర్సీబీ-కింగ్స్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గావస్కర్‌  చేసిన కామెంట్లపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇక్కడ  అనుష్క శర్మపై సెక్సీయస్ట్‌ కామెంట్లను గావస్కర్‌ చేశాడని సోషల్‌ మీడియాలో హోరెత్తుతుంది. దీనిపై గావస్కర్‌కు అనుష్క శర్మ కౌంటర్‌ ఇవ్వడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.  ‘మిస్టర్‌ గావస్కర్‌.. మీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. భర్త ఆట గురించి భార్యను టార్గెట్‌ చేయాలా.?, మాకు సమాన గౌరవం ఇవ్వాలని అనుకోలేదా? అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు.

తాజాగా అనుష్క శర్మ కామెంట్స్‌కు గావస్కర్‌ స్పందించారు. తానేమీ అనుష్క శర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, తాను ఎక్కడ ఆ వ్యాఖ్యలు చేశానో చూపించాలన్నాడు. తాను అన్న దానిని వక్రీకరించారన్నాడు. తాను కేవలం విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మలు లాక్‌డౌన్‌ సమయంలో పోస్ట్‌ చేసిన వీడియోను ఉద్దేశిస్తూ మాత్రమే తన వ్యాఖ్యానాన్ని చెప్పానన్నాడు. లాక్‌డౌన్‌లో కోహ్లి... అనుష్క బౌలింగ్‌ను మాత్రమే ప్రాక్టీస్‌ చేశాడని మాత్రమే అన్నానని,  ఈ ప్రాక్టీస్‌ సరిపోదనే ఉద్దేశమే తన వ్యాఖ్యల్లో ఉందన్నాడు. ఇందులో సెక్సీయస్ట్‌ కామెంట్లు ఏమున్నాయని గావస్కర్‌ ప్రశ్నించాడు.(చదవండి: ఏమిరా కోహ్లి.. ఎగ్జామ్‌లో తేలిపోయావ్‌!)

లాక్‌డౌన్‌ సమయంలో  అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.  ఏప్రిల్‌ నెలలో క్రికెట్‌కు దూరమైన కోహ్లికి దాన్ని గుర్తు చేస్తూ ఫోర్‌ కొట్టూ అంటూ ఒకటే అల్లరి చేసేశారు. ‘ ఏయ్‌ కోలీ(కోహ్లి) చౌకా మార్‌.. చౌకా.. క్యా కర్రా’ అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది అనుష్క. దీనికి సంబంధించిన వీడియో అప్పుడు బాగా వైరల్‌ అయ్యింది. ఇప్పుడు తాను ఇదే వీడియో గురించి మాట్లాడానని గావస్కర్‌ చెప్పుకొచ్చారు. ఇందులో అనుష్కను తాను ఎక్కడ విమర్శించలేదన్నాడు. కోహ్లికి సరైన ప్రాక్టీస్‌ లేదనే ఉద్దేశమే తన వ్యాఖ్యల్లో ఉందన్నాడు.(చదవండి:సన్‌రైజర్స్‌ ‘గాయం’ ఎంతవరకూ..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top