కుంబ్లే సరసన వాషింగ్టన్‌ సుందర్‌

Washington Sundar Joins Kumbles Best Economy For RCB - Sakshi

దుబాయ్‌: రాయల్‌ చాలెంజర్స్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతమైన బౌలింగ్‌ గణాంకాలతో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో వికెట్‌ తీసి 12 పరుగులిచ్చాడు. దాంతో ఎకానమీ రేటు పరంగా అనిల్‌ కుంబ్లే సరసన చేరాడు. 2009లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్పిన్నర్‌గా కుంబ్లే రెండు వికెట్లు తీసి 12 పరుగులు ఇచ్చాడు. ఫలింతగా ఎకానమీ రేటు 3.00గా నమోదైంది. ఇప్పుడు అదే ఎకానమీ గణాంకాలను వాషింగ్టన్‌ సుందర్‌ నమోదు చేశాడు. దాంతో కుంబ్లే సరసన సుందర్‌ నిలిచాడు. (చదవండి: ఏబీ, దూబేలు దుమ్ములేపారు..)

ఆర్సీబీ తరఫున ఒక స్పిన్నర్‌గా అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన జాబితాలో చహల్‌ 1.50 ఎకానమీ రేటుతో తొలి స్థానంలో ఉండా, ఆ తర్వాత స్థానంలో బద్రీ ఉన్నాడు. 2019లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో చహల్‌  తన నాలుగు ఓవర్ల కోటాలో ఆరు పరుగులే ఇచ్చి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా, 2017లో ముంబైతో మ్యాచ్‌లో బద్రీ 9 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. దాంతో బద్రీ 2.25 ఎకానమీ రేటు నమోదు చేశాడు. ఆ తర్వాత స్థానంలో కుంబ్లే, సుందర్‌లు ఉన్నారు. ఇక ఈ రోజు ఆటలో పవర్‌ ప్లేలో వాషింగ్టన్‌ సుందర్‌ 3 ఓవర్లలో 7 పరుగులిచ్చి వికెట్‌  తీశాడు. దాంతో అతని ఎకానమీ రేటు 2.33గా ఉంది.

ముంబైతో మ్యాచ్‌లో ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అరోన్‌ ఫించ్‌(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), దేవదూత్‌ పడిక్కల్‌(54; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్ని అందివ్వగా  డివిలియర్స్‌( 55 నాటౌట్‌; 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), దూబే(27 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు)లు బ్యాట్‌ ఝుళిపించడంతో 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top