సెకండ్‌ చాన్స్‌ ఇవ్వని కోహ్లి..! | Wade Dropped Then Run Out By Kohli | Sakshi
Sakshi News home page

సెకండ్‌ చాన్స్‌ ఇవ్వని కోహ్లి..!

Dec 6 2020 4:10 PM | Updated on Dec 7 2020 5:26 AM

Wade Dropped Then Run Out By Kohli - Sakshi

సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న  రెండో టీ20లో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 పరుగులు సాధించాడు. ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో సారథిగా వ్యవహరించిన వేడ్‌.. డీఆర్సీ షార్ట్‌తో కలిసి ఓపెనర్‌గా దిగాడు. నటరాజన్‌ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతికి డీఆర్సీ షార్ట్‌(9) ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్‌  వేడ్‌ మాత్రం ఆది నుంచి రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతిని భారీ హిట్‌ చేయగా దాన్ని బౌండరీ లైన్‌ వద్ద హార్దిక్‌ పాండ్యా పట్టే యత్నం చేసి విఫలమయ్యాడు. డీప్‌ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ క్యాచ్‌ను అందుకునే యత్నం చేసినా అది సాధ్యం కాలేదు. (పృథ్వీ షా, గిల్‌ డకౌట్లు.. రహానే  శతకం)

అది కాస్తా ఫోర్‌కు వెళ్లింది. ఆ తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతిని ఫ్లిక్‌ షాట్‌ ఆడాడు వేడ్‌. కానీ అది లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకుని  కవర్స్‌లోకి వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి ఆ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో వేడ్‌ పరుగు తీసెందుకు యత్నించాడు. ఆ సెకండ్‌ చాన్స్‌ను కోహ్లి వదల్లేదు. నాన్‌స్టైకింగ్‌  ఎండ్‌లో ఉన్న  స్టీవ్‌ స్మిత్‌ బంతిని గమనిస్తూ పరుగు కోసం వెళ్లాలా వద్దా అనే సందిగ్థంలో ఉన్నాడు. అప్పటికే సగం పిచ్‌లోకి వచ్చిన వేడ్‌కు వద్దంటూ స్మిత్‌ వారించాడు. దాంతో వేడ్‌ వెనక్కి వెళ్లే యత్నం చేయగా అప్పటికే బంతి కోహ్లి వద్ద  నుంచి వికెట్‌ కీపర్‌ రాహుల్‌కు చేరడం, రనౌట్‌ చేయడం సెకన్లలో జరిగిపోయింది. ఒక చాన్స్‌ ఇచ్చిన కోహ్లి.. రెండో చాన్స్‌ తీసుకోకుండా వేడ్‌ను పెవిలియన్‌కు పంపాడు.‌  ఈ రనౌట్‌ బాగా వైరల్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. వేడ్‌కు జతగా స్మిత్‌(46) రాణించాడు. మ్యాక్స్‌వెల్‌ 22, హెన్రిక్యూస్‌ 26 పరుగులు చేశారు. చివర్లో స్టోయినిస్‌ 7 బంతుల్లో 1 సిక్స్‌ సాయంతో అజేయంగా 16 పరుగులు చేయడంతో ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement