విరాట్‌ ఖాతాలో మరో భారీ రికార్డు | Virat Kohli Shatters KL Rahul's Six Hitting Milestone In IPL | Sakshi
Sakshi News home page

విరాట్‌ ఖాతాలో మరో భారీ రికార్డు

Apr 16 2026 11:47 AM | Updated on Apr 16 2026 12:00 PM

Virat Kohli Shatters KL Rahul's Six Hitting Milestone In IPL

దిగ్గజ బ్యాటర్‌, ఆర్సీబీ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్‌ 15) లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 

ఈ మ్యాచ్‌లో విరాట్‌ ఓ సిక్సర్‌ కొట్టి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా తన సిక్సర్ల సంఖ్యను 185కు పెంచుకున్నాడు. విరాట్‌ ఈ రికార్డు సాధించే క్రమంలో కేఎల్‌ రాహుల్‌ను అధిగమించాడు. రాహుల్‌ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 184 సిక్సర్లు బాదాడు. రాహుల్‌ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ (148) ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత టాప్‌-5 ఓపెనర్లు
విరాట్‌ కోహ్లి- 185
కేఎల్‌ రాహుల్‌- 184
రోహిత్‌ శర్మ- 148
శిఖర్‌ ధవన్‌- 143
శుభ్‌మన్‌ గిల​్‌- 118

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు​ బాదిన ఓపెనర్‌ (ఓవరాల్‌గా) రికార్డు క్రిస్‌ గేల్‌ (326) పేరిట ఉంది. గేల్‌ తర్వాతి స్థానాల్లో డేవిడ్‌ వార్నర్‌ (210), విరాట్‌ కోహ్లి (185), కేఎల్‌ రాహుల్‌ (184) ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-5 ఓపెనర్లు
క్రిస్‌ గేల్‌- 326
డేవిడ్‌ వార్నర్‌- 210
విరాట్‌ కోహ్లి- 185
కేఎల్‌ రాహుల్‌- 184
ఫాఫ్‌ డుప్లెసిస్‌- 159

కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కోహ్లి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 34 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 49 పరుగులు చేశాడు. విరాట్‌ బాదిన సిక్సర్‌ దిగ్వేశ్‌ రాఠీ బౌలింగ్‌లో వచ్చింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రసిక్‌ సలామ్‌ దార​్‌ 4, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2, హాజిల్‌వుడ్‌ ఓ వికెట్‌ తీశారు. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌ (40), ముకుల్‌ చౌదరి (39), ఆయుశ్‌ బదోని (38), మార్క్రమ్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. సాల్ట్‌ (7), పడిక్కల్‌ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. విరాట్‌ (49), కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (27), వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్‌ డేవిడ్‌ (14 నాటౌట్‌), షెపర్డ్‌ (14) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ 3, ఆవేశ్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement