Virat Kohli Refutes Charging Rs 11.45 Crore Per Instagram Post - Sakshi
Sakshi News home page

అవన్నీ నిజం కాదు.. దయచేసి అర్ధం చేసుకోండి: విరాట్‌ కోహ్లి

Aug 12 2023 11:20 AM | Updated on Aug 12 2023 11:35 AM

Virat Kohli Says Reports Of Him Charging Rs 11 and 45 Crore - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్ విరాట్‌ కోహ్లికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో రికార్డులు కొల్లగొట్టే కోహ్లి.. సోషల్‌ మీడియాలో కూడా భారీగా అభిమానులను పెంచుకున్నాడు. అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 256 మిలియన్ల(25 కోట్లకు పైగా) మంది ఫాలో అవుతున్నారు.

ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఒక్కో పోస్టుకు 11.45 కోట్లు సంపాదిస్తున్నడని సోషల్‌ మీడియా వ్యాపార నిర్వహణ వేదిక హోపర్‌ హెచ్‌క్యూ వెల్లడించింది. అయితే  తాజాగా ఈ వార్తలపై కింగ్‌ కోహ్లి స్పందించాడు. ఇవన్నీ అవాస్తవమని కోహ్లి కొట్టిపారేశాడు. "జీవితంలో ఇప్పటివరకు నేను సంపాదించిన ప్రతీరూపాయికి నేను కృతజ్ఞడిగా ఉన్నాను.

అయితే నా సోషల్ మీడియా సంపాదన గురించి వస్తున్న వార్తలు మాత్రం నిజం కాదు. దయచేసి అర్ధం చేసుకోండి" అంటూ విరాట్‌ ట్విట్‌ చేశాడు. ఇక కోహ్లి.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి ఆసియాకప్‌తో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఆసియాకప్‌కు భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

చదవండి: సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్‌! వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement