IND vs SL: ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్‌తో భారీ సిక్స్! వీడియో వైరల్

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్‌కు ఇది 46 సెంచరీ.
ఈ సిరీస్‌లో కింగ్‌కు ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్ కోహ్లి కెరీర్‌లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది.
హెలికాప్టర్ షాట్ కొట్టిన విరాట్
ఈ మ్యాచ్‌లో అద్భతమైన హెలికాప్టర్ షాట్ బాదిన విరాట్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. భారత ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన కసున్ రజిత బౌలింగ్‌లో నాలుగో బంతిని ఫ్రంట్‌ఫుట్ వచ్చిన విరాట్ లాంగ్ ఆన్ దిశగా 97 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. విరాట్ అద్భుతమైన షాట్ చూసిన అభిమానులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IND vs SL: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే?
📹 Mighty Maximum - a 97m SIX from Virat Kohli 👀👀
Live - https://t.co/q4nA9Ff9Q2 #INDvSL @mastercardindia pic.twitter.com/R3CzXTWBT5
— BCCI (@BCCI) January 15, 2023
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు