యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 28.2 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించారు.
ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. టెస్టు మ్యాచ్‌లో టీ20 తరహా బ్యాటింగ్ చేశాడు. ఫార్మాట్ ఏదైనా తనకు తెలిసిందే బాదుడు ఒక్కటే అన్నట్లు హెడ్ ఇన్నింగ్స్ కొనసాగింది. తన తుపాన్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను భయపెట్టేశాడు.
ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హెడ్.. ఒంటి చేత్తో తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123 పరుగులు చేశాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన హెడ్..
👉టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4వ ఇన్నింగ్స్‌లో(ఛేజింగ్) అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ గిల్బర్ట్ జెస్సోప్ పేరిట ఉండేది. జెస్సో 1902 యాషెస్‌లో ఆస్ట్రేలియాపై నాల్గవ ఇన్నింగ్స్‌లో 76 బంతుల్లో శతక్కొట్టాడు. తాజా ఇన్నింగ్స్‌తో 123 ఏళ్ల గిల్బర్ట్ రికార్డును బ్రేక్ చేశాడు.
👉టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన చేసిన ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్(69 బంతులు) రికార్డును హెడ్ సమం చేశాడు.
👉యాషెస్ సిరీస్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా హెడ్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్(57) అగ్రస్ధానంలో ఉన్నాడు.
👉 ఒక టెస్టు మ్యాచ్‌లో విజయవంతమైన రన్ ఛేజ్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన ప్లేయర్‌గా హెడ్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో(147.82) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో 148.19 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన హెడ్.. బెయిర్‌స్టో రికార్డును బ్రేక్ చేశాడు.
చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?


