
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజాయం పాలైన టీమిండియా ప్రపంచకప్ నుంచి ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి నేపథ్యంలో కొందరు సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని గావస్కర్ తెలిపాడు.
అదే విధంగా రోహిత్ స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ‘ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ సారథిగా తొలి ప్రయత్నంలో విజేతగా నిలిపిన పాండ్యా తప్పకుండా తదుపరి టీమిండియా కెప్టెన్ అవుతాడు. జట్టులోని 35 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు రిటైర్మెంట్ యోచనలో ఉన్నారు. త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2022: మళ్లీ అదే వ్యథ... తీరు మారని టీమిండియా