
IND Vs PAK MS Dhoni As Mentor.. టి20 ప్రపంచకప్ 2021 నేపథ్యంలో టీమిండియా ఒత్తిడి గురవుతోందని.. అందుకే ఎంఎస్ ధోనిని మెంటార్‌గా ఎంపికచేశారంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఈసారి ప్రపంచకప్ దుబాయ్‌లో జరుగుతుండడంతో పాకిస్తాన్ జట్టుకు బాగా కలిసివస్తుందని తెలిపాడు. ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన్వీర్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్య్వూలో కపిల్‌దేవ్, సెహ్వాగ్ కూడా పాల్గొన్నారు.
చదవండి: T20 WC IND vs PAK: బాబర్ అజమ్ బ్యాటింగ్.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు
''పేపర్‌పై చూస్తే టీమిండియా కచ్చితంగా బలంగా కనిపిస్తుంది. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి తాజా ప్రదర్శనను తీసుకుంటే మాత్రం కాస్త ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. టి20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్‌లో కెప్టెన్సీ పదవికి గుడ్‌బై చెప్పనున్నట్లు కోహ్లి ఇప్పటికే తెలిపాడు. నా ప్రదర్శన బాగాలేకనే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లి ప్రకటించాడని.. గిఫ్ట్‌గా టి20 ప్రపంచకప్‌ను అందించాలని టీమిండియా భావిస్తోంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుందని.. అందుకే ధోనిని మెంటార్‌గా ఎంపిక చేసింది.
ఐపీఎల్ పరంగా చూసుకుంటే టీమిండియా జట్టులో ఉన్న టాప్ 10 ఆటగాళ్లలో ఆశించిన ప్రదర్శన కనబడలేదు. టీమిండియా కీలక స్పిన్నర్లుగా ఉన్న అశ్విన్, జడేజాలు కూడా అనుకున్నంత రాణించలేకపోయారు. ఇక టీమిండియా- పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ చూసుకుంటే పాకిస్తాన్ నాకు ఫెవరెట్‌గా కనిపిస్తోంది. గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టు దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడుతూ వస్తోంది. పేపర్‌పై టీమిండియా బలంగా కనిపిస్తున్నప్పటికీ ఆరోజు మ్యాచ్‌లో ఎవరు బాగా ఆడితే వారిదే విజయం అవుతోంది.'' అంటూ తన్వీర్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. ఇక అక్టోబర్ 24న టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
చదవండి: T20 World Cup: అరె... నాలుగు మ్యాచ్‌లలోనూ అదే ఫలితం!