సునీల్​ ఛెత్రి కమాల్​.. కిక్​తో మెస్సీ వెనక్కి

Sunil Chhetri Surpassing Lionel Messi - Sakshi

రోనాల్డో -మెస్సీ.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప​ అంటూ ఇద్దరి ఫ్యాన్స్​ సోషల్ మీడియాలో కుమ్ములాడుకోవడం చూస్తుంటాం. కానీ, ఈ ఇద్దరిలో మధ్యలో గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇంకొకడు వచ్చి దూరాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు.. భారత ఫుట్​బాల్​ మాంత్రికుడు సునీల్ ఛెత్రి.
 
దోహా:  సోమవారం 2022 ఫిఫా వరల్డ్‌కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్‌ టోర్నీలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2‌‌-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్​ కూడా సునీల్​ ఛెత్రినే కొట్టాడు. ఈ ఫీట్​తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్​బాల్​ ఆటగాడిగా(ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల) రెండో స్థానంలో నిలిచాడు ఛెత్రి. 

ప్రస్తుతం ఈ లిస్ట్​లో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా(103)గోల్స్​తో, రెండో స్థానంలో మొన్నటిదాకా అర్జెంటీనా స్టార్​ లియోనాల్ మెస్సీ(72)గోల్స్​తో ఉన్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్​లో రెండు గోల్స్​ సాధించడం ద్వారా మొత్తం 74 గోల్స్​తో ఛెత్రి మెస్సీని వెనక్కి నెట్టి రెండో ప్లేస్​కి చేరాడు. ఇక ఆల్​టైం హయ్యెస్ట్ టాప్​ 10 గోలర్స్​ లిస్ట్​లో చేరడానికి ఛెత్రి మరొక గోల్(75)​​ సాధిస్తే సరిపోతుంది.

వరల్డ్​ కప్​ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత్​కి ఆరేళ్ల తర్వాత దక్కిన తొలి గెలుపు ఇదే. ఇప్పటికే భారత్ ఫిఫా ఆశలు చల్లారగా.. కేవలం చైనాలో జరగబోయే ఆసియా కప్​ అర్హత కోసం భారత్ ఫుట్​బాల్​ ఆడుతోంది. ఇక మెస్సీ యాక్టివ్​గా ఉండడంతో ఛెత్రి రికార్డు త్వరగానే కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ టాప్​ లిస్ట్​లో చేరిన ఛెత్రికి ఇండియన్​ సోషల్ మీడియా సలాం చెబుతోంది.  ఇక ఈ రికార్డు ఫీట్​ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం.

చదవండి: భారత్​ పరాజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top