అదొక గ్రేట్‌ చాలెంజ్‌: ఫ్లెమింగ్‌

Stephen Fleming On Rebuilding CSK Ahead Of IPL 2021 - Sakshi

దుబాయ్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ చేరడంలో విఫలమైనా వచ్చే ఏడాది మరింత పటిష్టంగా తిరిగొస్తామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్పష్టం చేశాడు. సీఎస్‌కేను తిరిగి పటిష్టం చేయడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు. ఆదివారం సీఎస్‌కే చివరి లీగ్‌ ఆడిన తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఫ్లెమింగ్‌.. ‘ మా ముందు అతి పెద్ద చాలెంజ్‌ ఉంది.  అత్యంత బాధ్యత సీఎస్‌కే ఎంపిక చేయడానికి కసరత్తులు చేస్తాం. రుతురాజ్‌ గైక్వాడ్‌ లాంటి యువ క్రికెటర్లతో పాటు పాత క్రికెటర్లతో సీఎస్‌కేను సమ్మేళనం చేస్తాం. (వాట్సన్‌ ఉద్వేగం.. క్రికెట్‌కు గుడ్‌ బై!)

ఎప్పుడూ సీఎస్‌కే జట్టు ఎంపికలో యజమాని శ్రీనివాసన్‌ కీలకంగా వ్యవహరిస్తారు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌, శ్రీనివాసన్‌లు వారికి మంచిదైన జట్టునే ఎంపిక చేస్తారు. దాన్ని వచ్చే ఐపీఎల్‌లో కూడా అవలంభిస్తాం. మేము పదేళ్లుగా నిలకడైన క్రికెట్‌ ఆడుతున్నామంటే జట్టు ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అది పెద్ద బాధ్యత. మా జట్టులో టాలెంట్‌ ఉంది. కానీ జట్టును ఎలా మిక్స్‌ చేయాలనే అంశంపై కసరత్తులు చేయనున్నాం’ అని తెలిపాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే తన లీగ్‌ దశను ఆరు విజయాలతో ముగించింది. టోర్నీ నుంచి నిష్క్రమించినా వరుసగా ఆ జట్టు సాధించిన మూడు విజయాలు మునపటి సీఎస్‌కేను గుర్తు చేశాయి. వరుస విజయాలు సాధించడంతో ధోని మీద వచ్చిన విమర్శలు కూడా చెక్‌ పడింది. కింగ్స్‌ పంజాబ్‌తో తన చివర మ్యాచ్‌లో సీఎస్‌కే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.(ఐపీఎల్‌ 2020: నెట్‌ రన్‌రేట్‌ టై అయితే..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top