'జడేజా ఇన్నింగ్స్‌ అంత గొప్పదేం కాదు.. దమ్ముంటే అక్కడ ఆడి చూపించాలి'

Stats can be very misleading, Gautam Gambhir Comments On Ravindra Jadeja - Sakshi

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 175 పరుగులతో పాటు 9 వికెట్ల పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో పలు రికార్డులను జడ్డూ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 175 పరుగులు చేసిన జడేజా ఏడో స్దానంలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో  జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిస్తోంది. ఇది ఇలా ఉండగా.. జడేజాపై టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కీలక వాఖ్యలు చేశాడు. శ్రీలంకతో తొలి టెస్టులో జడేజా ప్రదర్శన అంత అత్యత్తుమైనది ఏమి కాదని గంభీర్‌ తెలిపాడు.

"జడేజా ఈ మ్యాచ్‌లో ఆడిన  ఇన్నింగ్స్‌ ఏమీ అంత అద్భుతమైనది కాదు. కేవలం గణాంకాలు కారణంగానే అతడి ఇన్నింగ్స్‌ను అత్యత్తమంగా భావిస్తున్నారు. విదేశాల్లో అతడు ఇదే ఇన్నింగ్స్‌ ఆడితే.. మరింత కాన్ఫిడెన్స్‌ను పొందుతాడు. జడేజా  సెంచరీ తర్వాత స్పిన్నర్లు ధనంజయ డి సిల్వ, అసలంక, ఎంబూల్దేనియా బౌలింగ్‌లో మరింత చెలరేగి ఆడాడు. అతడు ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్‌లో గాని ఏడో స్ధానంలో  40 లేదా 50 పరుగుల సాధించి ఉంటే.. ఈ ఇన్నింగ్స్‌ కంటే అత్యత్తమైనది అని చేప్పుకోవచ్చు. అయితే జడేజా అత్యత్తుమ ఆల్‌రౌండర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు టీ20లో హిట్టింగ్‌ కూడా చేయగలడు. కానీ ఇది మాత్రం అతడి బెస్ట్ ఇన్నింగ్స్ మాత్రం కాదు" అని గంభీర్‌ పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: డు ప్లెసిస్‌కు భారీ షాక్‌.. ఆర్సీబీ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top