స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో బ్లాక్ మ్యాజిక్‌..! అందుకే సీఎస్‌కే ఓడిపోయింది? | SRH Fans Lemon Trick Pays Off In Shock CSK Defeat | Sakshi
Sakshi News home page

IPL 2026: స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో బ్లాక్ మ్యాజిక్‌..! అందుకే సీఎస్‌కే ఓడిపోయింది?

Apr 19 2026 1:43 PM | Updated on Apr 19 2026 2:46 PM

SRH Fans Lemon Trick Pays Off In Shock CSK Defeat

ఐపీఎల్‌-2026 స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ గెలుపొందింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకుంది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది.

అయితే ఈ మ్యాచ్ ఫ‌లితం కంటే.. సీఎస్‌కే ఇన్నింగ్స్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సీఎస్‌కే బ్యాటర్ దూబే క్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒక ఎస్‌ఆర్‌హెచ్ అభిమాని నిమ్మకాయ చేతిలో పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతున్నట్లు కెమెరా కంటికి చిక్కాడు.

వెంట‌నే శివ‌మ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో స‌ద‌రు అభిమాని సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు  బ్లాక్ మ్యాజిక్ కారణంగానే దుబే ఔట్ అయ్యాడని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రి కొంత‌మంది మంత్రాల‌కు చింతకాయ‌లు రాల‌వంటూ మ‌రి కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఈ సంఘటనపై సీఎస్‌కే యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ ఓ లెటర్‌ హెడ్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతుంది.
చదవండి: BCCI: అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ సంచలన నిర్ణయం


 

 

Advertisement
 
Advertisement
Advertisement