
శుభ్‌మన్ గిల్.. టీమిండియా కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను భారత్ చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గిల్ సారథ్యంలో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.
ఢిల్లీ టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. యశస్వి జైశ్వాల్(175), శుభ్‌మన్ గిల్(129), సాయిసుదర్శన్(87) బ్యాటింగ్‌లో సత్తాచాటగా.. కుల్దీప్ యాదవ్( 8 వికెట్లు), జడేజా(4 వికెట్లు), జస్పీత్ బుమ్రా (4) బౌలింగ్‌లో మాయ చేశారు. ఇక విజయంపై మ్యాచ్ అనంతరం గిల్ స్పందించాడు. తన నాయకత్వ అనుభవం, జట్టు వ్యూహాలపై గిల్ మాట్లాడాడు.
"భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఆటగాడితో కలిసి పనిచేయడం, జట్టును నడిపించడం వంటివి నేను నేర్చుకుంటున్నాను.
పరిస్థితులకు తగ్గ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. కొన్ని సందర్భాల్లో ధైర్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని సార్లు ఎక్స్-ఫాక్టర్ ఆటగాళ్లను రంగం దించాల్సి వవస్తుంది. ఏ ఆటగాడైతే పరుగులు లేదా వికెట్లు అందించగలడో వారిని ఎక్స్-ఫాక్టర్‌గా ఉపయోగించుకోవాలి" అని గిల్ చెప్పుకొచ్చాడు.

ఫాలో-ఆన్ నిర్ణయం గురించి మాట్లాడుతూ.. "విండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మేము సుమారు 300 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. ఐదో రోజున వికెట్లు తీయడం కష్టం అవుతుందనే భావించి ఫాలో-ఆన్ ఆడించాము. మేము 500 పరుగులు చేసినా.. ఆఖరి రోజు ఆటలో వికెట్లు పడగొట్టడం కష్టమవుతుందని ఫాలో ఆన్‌ను అమలు చేశాము.
నితీష్ రెడ్డి గురించి మాట్లాడుతూ .. నితీష్‌కు ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. విదేశాల్లో మాత్రమే కాదు, ఇక్కడ పిచ్‌లపై కూడా అతడిని అలవాటు చేయాలని చూస్తున్నాము. విదేశీ గడ్డపై మ్యాచ్‌లను గెలవడంలో మాకు సహాయపడతారని భావించే కొంతమంది ఆటగాళ్లను మేము ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాము. ఎందకంటే అక్కడ గెలవడం మాకు ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది.
నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు కేవలం బ్యాటర్‌గానే ఆలోచిస్తాను. నేను 3-4 ఏళ్ల వయసు నుంచి బ్యాటింగ్ చేస్తున్నాను. క్రీజులోకి వెళ్లిన ప్రతీసారి జట్టును గెలిపించడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచించలేదు. ఫ్లైట్‌లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు నవ్వుతూ గిల్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు..