
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్‌కు మించిన బ్యాట్స్‌మెన్ లేడంటూనే అతనిలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశాడు. సచిన్ అద్భుతమైన బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. అతని బ్యాటింగ్‌లో ఓ బలహీనతను గమనించానని పేర్కొన్నాడు. లిటిల్ మాస్టర్ ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడని అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్‌కు మించిన బ్యాట్స్‌మెన్ లేడంటూనే అతనిలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశాడు. సచిన్ అద్భుతమైన బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. అతని బ్యాటింగ్‌లో ఓ బలహీనతను గమనించానని పేర్కొన్నాడు. లిటిల్ మాస్టర్ ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడని అభిప్రాయపడ్డారు. ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీధరన్ మాట్లాడుతూ.. సచిన్ బ్యాటింగ్ శైలిలో పలు లోపాలను ప్రస్తావించాడు.
పేసర్లను, లెగ్ స్పిన్నర్లు సమర్ధవంతంగా ఎదుర్కొనే సచిన్.. ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో కాస్త ఇబ్బంది పడతాడని, ఈ విషయాన్ని నా కెరీర్‌లో చాలా సందర్భాల్లో గుర్తించానని చెప్పుకొచ్చాడు. బంతిని అంచనా వేయడంలో దిట్ట అయిన సచిన్.. తనతో సహా చాలా మంది ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో వికెట్‌ను సమర్పించుకున్న విషయాన్ని ఉదహరించాడు. కెరీర్ ఆసాంతం సచిన్‌కు ఇది పెద్ద లోపంగా ఉండిందని పేర్కొన్నాడు. అయితే, ఈ విషయాన్ని తానెప్పుడు సచిన్ వద్ద ప్రస్తావించలేదని వెల్లడించాడు.
ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ(14 సార్లు) తరువాత సచిన్‌ను అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనత తనదేనని(13) ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఇక, ఓవరాల్‌గా .. సచిన్ చాలా క్లిష్టమైన ఆటగాడని, అతడిని అవుట్ చేయడం చాలాకష్టమని మురళీధరన్ చెప్పుకొచ్చాడు. కాగా, శ్రీలంక తరఫున 133 టెస్టుల్లో 800 వికెట్లు, 350 వన్డేల్లో 534 వికెట్లు పడగొట్టిన మురళీ.. అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 1347 పడగొట్టాడు. అతని తర్వాతి స్థానంలో 1001 వికెట్లతో ఆసీస్ లెజండరీ స్పిన్నర్ రెండో స్థానంలో, భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే 956 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
చదవండి: XYZలకు అవకాశాలు వస్తుంటే టార్చర్ అనుభవించా, అందుకే రిటైర్మెంట్ ప్రకటించా..