విండీస్‌ వీరుడి విధ్వంసం.. చివరి ఓవర్లో గట్టెక్కారు! | Rutherford-Sixers-Barbados-Won-Last-Over-Vs Saint Lucia-CPL 2026 | Sakshi
Sakshi News home page

విండీస్‌ వీరుడి విధ్వంసం.. చివరి ఓవర్లో గట్టెక్కారు!

Aug 17 2026 1:49 PM | Updated on Aug 17 2026 1:56 PM

Rutherford-Sixers-Barbados-Won-Last-Over-Vs Saint Lucia-CPL 2026

Photo Credit: Twitter

క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో బార్బ‌డోస్ ట్రైడెంట్స్ థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. వ‌ర్షం అంత‌రాయంతో 18 ఓవ‌ర్ల‌కు కుదించిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌పై బార్బ‌డోస్ ట్రైడెంట్స్ 9 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బ‌డోస్ 18 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. 

షెర్ఫేన్ రూథ‌ర్‌ఫోర్డ్ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించ‌గా, బ్రాండ‌న్ కింగ్‌ (39), క్వింట‌న్ డికాక్ (38) రాణించారు. 90 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో రివాల్డో క్లార్క్ (23)తో క‌లిసి రూథ‌ర్‌ఫోర్డ్ ఇన్నింగ్స్ న‌డిపించాడు. నాలుగో వికెట్‌కు ఈ జోడి 79 ప‌రుగులు జోడించ‌డంతో బార్బ‌డోస్ గౌర‌వప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. సెంట్ లూసియా బౌల‌ర్ల‌లో రోస్ట‌న్ చేజ్‌, షెడ్లే వాన్ చెరో 2 వికెట్లు తీశారు. 

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో సెయింట్ లూసియా కింగ్స్ 18 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు చేసింది. అకీమ్ ఆగ‌స్టీ (34 బంతుల్లో 63) సిక్స‌ర్ల‌తో రెచ్చిపోయిన‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. రోస్ట‌న్ చేజ్ (34), మాథ్యూ ఫోర్డ్ (24 నాటౌట్‌) చివ‌ర‌కు వ‌ర‌కు అజేయంగా నిలిచిన‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. 

వ‌రుస విరామాల్లో వికెట్లు ప‌డ‌డంతో సెయింట్ లూసియా ఛేద‌న‌లో త‌డ‌బ‌డింది. ట్రైడెంట్స్ బౌల‌ర్ల‌లో గుద‌కేశ్ మోతి 3 వికెట్లు తీయ‌గా, ముజీబ్ ఉర్ రెహ్మ‌న్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. హాఫ్ సెంచ‌రీ సాధించిన రూథ‌ర్‌ఫోర్డ్‌కు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ల‌భించింది.

Read: 'న‌మ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement