ఒంటరివాడైన రోహిత్‌ శర్మ.. ఐపీఎల్‌ 2022లో ఏకైక కెప్టెన్‌గా..! | Rohit Sharma Only Title Winning Captain In IPL 2022 Season | Sakshi
Sakshi News home page

IPL 2022: ఒంటరివాడైన రోహిత్‌.. ప్రస్తుత సీజన్‌లో టైటిల్ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా..!

Mar 26 2022 5:21 PM | Updated on Mar 26 2022 6:34 PM

Rohit Sharma Only Title Winning Captain In IPL 2022 Season - Sakshi

Rohit Sharma: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మ ఒంటరివాడయ్యాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 5 టైటిళ్లు సాధించి, ఐపీఎల్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్‌.. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఏకైక విన్నింగ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుత సీజన్‌లో రోహిత్‌ మినహా ఏ ఒక్క కెప్టెన్‌ కూడా ఐపీఎల్‌ టైటిల్ గెలవలేదు. 


ఇక్కడ మరో విశేషమేమిటంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారధి కేన్‌ విలియమ్సన్‌ (2018) , కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌)లను మినహాయిస్తే, ఈ సీజన్‌లో ఆడబోతున్న కెప్టెన్లలో ఏ ఒక్కరూ కనీసం ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఆడింది లేదు. ప్రస్తుత ఈ పరిస్థితిని చూసి తమ కెప్టెన్‌కు ఈసారి తిరుగుండదని ముంబై ఇండియన్స్‌ అభిమానులు లోలోపల సంతోషపడుతున్నారు. 


ఈ సీజన్‌కు ముందు రోహిత్‌కు తోడుగా ధోని ఉండేవాడు. అయితే సీజన్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి రోహిత్‌ను ఒంటరివాడిని చేశాడు. ఐపీఎల్‌లో ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ను నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. 

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో వివిధ జట్ల కెప్టెన్ల వివరాలు

ముంబై ఇండియన్స్‌ : రోహిత్‌ శర్మ (ఐదు సార్లు విన్నింగ్‌ టీమ్‌ కెప్టెన్‌)
సన్‌రైజర్స్ హైదరాబాద్‌: కేన్ విలియమ్సన్‌ (2018 రన్నరప్‌)
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ : శ్రేయస్‌ అయ్యర్‌ (2020 రన్నరప్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌))
ఢిల్లీ క్యాపిటల్స్‌ : రిషబ్‌ పంత్‌
రాజస్థాన్‌ రాయల్స్‌ : సంజూ శాంసన్‌
లక్నో సూపర్‌ జెయింట్స్‌ : కేఎల్‌ రాహుల్‌ 
గుజరాత్‌ టైటాన్స్‌ : హార్ధిక్‌ పాండ్యా (తొలి సారి కెప్టెన్‌)
పంజాబ్‌ కింగ్స్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (తొలి సారి కెప్టెన్‌)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ : రవీంద్ర జడేజా (తొలి సారి కెప్టెన్‌)
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు : ఫాఫ్‌ డెప్లెసిస్‌ (తొలి సారి కెప్టెన్‌)
చదవండి: IPL 2022: వెంకటేశ్‌ అయ్యర్‌కు ప్రత్యేక సందేశం పంపిన WWE సూపర్‌ స్టార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement