ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌: కెరీర్‌ అత్యుత్తమ స్థానంలో రిషభ్‌ పంత్‌

Rishabh Pant Becomes Highest Ranked Wicketkeeper Batsman - Sakshi

దుబాయ్‌: బ్రిస్బేన్‌ టెస్టు హీరో రిషభ్‌ పంత్, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పంత్‌ 13వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 691 పాయింట్లు ఉన్నాయి. కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌), స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా) వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో ఉండగా... భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (862 పాయింట్లు)ని వెనక్కి నెట్టి ఆసీస్‌ ప్లేయర్‌ లబ్‌షేన్‌ (878 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత ప్లేయర్లు పుజారా ఏడో స్థానంలో, రహానే తొమ్మిదో ర్యాంకులో నిలిచారు. బౌలర్ల విభాగంలో సిరాజ్‌ 32 స్థానాలు మెరుగుపరుచుకొని 45వ ర్యాంక్‌కు చేరాడు. బౌలర్ల జాబితాలో ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా), స్టువర్ట్‌బ్రాడ్‌ (ఇంగ్లండ్‌), నీల్‌ వాగ్నర్‌ (న్యూజిలాండ్‌)... ఆల్‌రౌండర్ల కేటగిరీలో బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌), జేసన్‌ హోల్డర్‌ (వెస్డిండీస్‌), జడేజా (భారత్‌) వరుసగా టాప్‌–3లో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top