రన్నరప్‌ రష్మిక  | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ రష్మిక 

Published Mon, Oct 23 2023 4:02 AM

Rashmika was the runner up in the ITF W15 tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళల టెన్నిస్‌ (ఐటీఎఫ్‌) సర్క్యూట్‌లో తొలి సింగిల్స్‌ టైటిల్‌ సాధించేందుకు హైదరాబాద్‌ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. బ్యాంకాక్‌లోని హువా హిన్‌లో ఆదివారం ముగిసిన ఐటీఎఫ్‌ డబ్ల్యూ15 టోర్నీలో రష్మిక రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది.

ఫైనల్లో ఆరో సీడ్‌ రష్మిక 2–6, 1–6తో రెండో సీడ్‌ అయూమి కోషిషి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా పది డబుల్‌ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. తన సర్విస్‌ను ఆరుసార్లు కోల్పోయిన రష్మిక ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. రన్నరప్‌గా నిలిచిన రష్మికకు ట్రోఫీతోపాటు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.   

Advertisement
 
Advertisement
 
Advertisement