శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు

Ranji Trophy 2022 23: Mayank Agarwal, kedar Jadhav, Rajat Patidar Hits Hundreds - Sakshi

Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్‌ మ్యాచ్‌ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. 

  • త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో చండీఘర్‌ ఆటగాడు మనన్‌ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్‌ మహాజన్‌ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు. 
  • ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్‌ ఆటగాడు చేతన్‌ బిస్త్‌ (129) సెంచరీతో రాణించాడు.
  • ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్‌ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ (165) శతకంతో అలరించాడు.
  • మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఆటగాడు అనుప్‌ అహ్లావత్‌ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్‌ (128), పునిత్‌ బిస్త్‌ (215), తారిఖ్‌ సిద్దిఖీ (102 నాటౌట్‌) శతకాల మోత మోగించారు.
  • విదర్భతో జరుగుతన్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ (121) సెంచరీ సాధించాడు.
  • జమ్మూ అండ్‌ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్‌ ఆటగాడు మహ్మద్‌ సైఫ్‌ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు.
  • గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాడు నెహాల్‌ వధేరా (123) సెంచరీ సాధించాడు.
  • జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆటగాడు కరణ్‌ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు.
  • గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు ఆర్‌ ప్రేమ్‌ (112) సెంచరీ సాధించాడు.
  • బరోడా-హిమాచల్‌ ప్రదేశ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా కెప్టెన్‌ విక్రమ్‌ సోలంకి (178), హిమాచల్‌ ఆటగాడు ప్రశాంత్‌ చోప్రా (111) శతకాలు సాధించారు.
  • అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్‌ జాదవ్‌ (142 నాటౌట్‌) శతకొట్టాడు.
  • ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్‌ దేశాయ్‌ (107), అర్పిత్‌ వసవద (127 నాటౌట్‌) సెంచరీలు సాధించారు.
  • తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (162) శతకొట్టాడు.
  • చత్తీస్‌ఘడ్‌-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చత్తీస్‌ఘడ్‌ ఆటగాడు అశుతోష్‌ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ ఆగర్వాల్‌ (102 నాటౌట్‌) సెంచరీలతో రాణించారు.
  • పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్‌ ఆటగాళ్లు గెహ్లౌత్‌ రాహుల్‌ సింగ్‌ (137), రజత్‌ పలివాల్‌ (101) శతకాలతో రాణించారు.  
     
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top