
ఐర్లాండ్ పర్యటనకు 17 మంది సభ్యలతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఐపీఎల్ అదరగొట్టిన రాహుల్ త్రిపాఠికి భారత జట్టులో తొలి సారిగా చోటు దక్కింది. అయితే మరోసారి ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియాకు నిరాశే ఎదరైంది. ఈ సిరీస్‌కు కూడా సెలెక్టర్లు త్రిపాఠికి మొండి చేయి చూపించారు.
గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో రాహుల్ తెవాటియా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన తెవాటియా.. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 147.62 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో గుజరాత్ జట్టుకు బెస్ట్ ఫినిషర్‌గా మారాడు.
కాగా ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టులో చోటు దక్కక పోవడంతో తెవాటియా నిరాశ చెందాడు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా తెవాటియా తన నిరాశను వ్యక్తం చేశాడు. "అంచనాలు కానీ ఆశలు కానీ పెట్టుకోకూడదు. అవి మనల్ని బాధిస్తాయి" తెవాటియా ట్విట్ చేశాడు. కాగా ప్రస్తుతం తెవాటియా ట్వీట్ వైరల్‌గా మారింది.
ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: Ranji Cricketer Kamal Singh Life Story:'14 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించి.. అరంగేట్రంలోనే సెంచరీతో'
Expectations hurts 😒😒
— Rahul Tewatia (@rahultewatia02) June 15, 2022