ఐపీఎల్-2026లో శనివారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సంచలన సెంచరీతో చెలరేగాడు.
వైభవ్ కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడు వైభవ్ ఆటతీరుకు సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సైతం ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం వైభవ్‌పై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"వైభవ్ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్. అతడు బ్యాటింగ్ స్కిల్స్ నిజంగా అద్భుతం. బంతిని చాలా బలంగా కొడుతున్నాడు. వైభవ్ బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుంది. అతడికి బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం లైన్ తప్పినా బంతిని మైదానం వెలుపల పడటం ఖాయమని" కమ్మిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ.. కమ్మిన్స్‌ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. కాగా15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే వరల్డ్‌క్లాస్ బౌలర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తన పవర్ ఏంటో చూపించాడు. ఈ ఏడాది సీజన్‌లో సూర్యవంశీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 357 పరుగులు చేశాడు.
చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్


