పర్దీప్ నర్వాల్ టూ ఫజెల్ అత్రాచలి.. ప్రోకబడ్డీ లీగ్‌లో స్టార్స్‌ వీళ్లే | Pardeep Narwal To Fazel Atrachali: Top Players To Watch Out For In Pro Kabaddi League In 2024, See Details About Them | Sakshi
Sakshi News home page

పర్దీప్ నర్వాల్ టూ ఫజెల్ అత్రాచలి.. ప్రోకబడ్డీ లీగ్‌లో స్టార్స్‌ వీళ్లే

Aug 19 2024 2:04 PM | Updated on Aug 19 2024 3:29 PM

Pardeep Narwal to Fazel Atrachali: Top players to watch out for in PKL 2024

ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ వేలం ముంబైలో ఘ‌నంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే.  ఆగ‌స్టు 15న జ‌రిగిన వేలంలో ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం కురిసింది. రాజస్తాన్‌కు చెందిన సచిన్‌ తన్వర్‌పై  రూ. 2.15 కోట్లు  వెచ్చించి మ‌రి తమిళ్‌ తలైవాస్ సొంతం చేసుకుంది. 

ఆ త‌ర్వాత మరో స్టార్‌ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ రెజాను రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ కైవ‌సం చేసుకుంది. ఇక పీకేఎల్-2024వ సీజ‌న్ ఆక్టోబ‌ర్ మొద‌టి వారంలో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలో స్టార్ ఆట‌గాళ్ల‌పై ఓ లుక్కేద్దాం.

పర్దీప్ నర్వాల్ 
ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) స్టార్ ప్లేయ‌ర్స్‌లో హ‌ర్యానాకు చెందిన రైడ‌ర్ పర్దీప్ నర్వాల్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. పీకేఎల్ 2024 వేలంలో బెంగ‌ళూరు బుల్స్‌ ప‌ర్దీప్‌ను సొంతం చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 170 మ్యాచ్‌లు ఆడిన ప‌ర్దీప్‌.. 1690 పాయింట్ల‌తో టాప్ రైడ‌ర్‌గా కొనసాగుతున్నాడు. 

పీకేఎల్‌లో 10 రైడ్ పాయింట్ల కంటే ఎక్కువ సగటుతో 1000 పాయింట్ల మార్కు స్కోర్‌ను అధిగమించిన మొదటి ఆట‌గాడిగా న‌ర్వాల్ నిలిచిచాడు. అత‌డిని అభిమానులు  ‘దుబ్కీ కింగ్’ పిలుస్తారు. గ‌తంలో అత‌డు పాట్నా పైరేట్స్, యుపీ యోధాస్ జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.

ఫజెల్ అత్రాచలి
పీకేఎల్‌లో అద్భుత‌మైన డిఫెండ‌ర్ల‌లో ఇరాన్‌కు చెందిన‌ ఫ‌జెల్ అత్రాచలి ఒక‌డు. పీకేఎల్ 2024 వేలంలో అత్రాచలిని బెంగాల్ వారియర్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అత‌డు ఖాతాలో మొత్తం 486 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి. 

పీకేఎల్‌లో అత్య‌ధిక ట్యాకిల్ పాయింట్ల చేసిన జాబితాలో ఫ‌జెల్ అత్రాచలి అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. లెఫ్ట్ కార్న‌ర్‌లో ఫ‌జెల్ ఉన్నాడంటే రైడ‌ర్స్ భ‌య‌ప‌డాల్సిందే. అత‌డు యూ ముంబా, పాట్నా పైరేట్స్ టైటిల్స్ సాధించ‌డంలో ఫ‌జెల్‌ది కీల‌క పాత్ర‌.

సచిన్‌ తన్వార్‌..
పీకేఎల్ 2024 వేలంలో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచిన  సచిన్ తన్వర్.. త‌మిళ్ త‌లైవాస్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. గ‌త కొన్ని సీజ‌న్ల‌గా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుండ‌డంతో  త‌లైవాస్ అత‌డిపై భారీ మొత్తం వెచ్చించింది. అత‌డి ఖాతాలో మొత్తంగా 951 రైడ్ పాయింట్లు ఉన్నాయి.

 గ‌త సీజ‌న్‌లో మొత్తం 171 పాయింట్లు సాధించాడు. 7వ సీజ‌న్‌లో ప‌ర్దీప్ న‌ర్వాల్ ఫ్రాంచైజీ మార‌డంతో ప‌ట్నా పైరేట్స్ రైడింగ్ డిపార్ట్‌మెంట్‌ను సచిన్ లీడ్ చేశాడు. గ‌తంలో గుజ‌రాత్ జెయింట్స్‌కు కూడా స‌చిన్ ఆడాడు.

మణిందర్ సింగ్ (రైడర్)
మ‌ణింద‌ర్ సింగ్ మ‌ళ్లీ త‌న సొంత‌గూట‌కి చేరాడు. పీకేఎల్-2024 వేలంలో రూ.1.5 కోట్ల‌కు మ‌ణింద‌ర్‌ను బెంగాల్ వారియ‌ర్స్ ద‌క్కించుకుంది. పీకేఎల్ చ‌రిత్ర‌లో పర్దీప్ న‌ర్వాల్ త‌ర్వాత అత్యంత విజ‌య‌వంత‌మైన రైడ‌ర్ల‌లో మ‌ణింద‌ర్ సింగ్ ఒక‌డు. ఈ ఆరు అడుగుల ఆజానుబాహుడు రైడ్‌కు వెళ్ల‌డాంటే ప్ర‌త్య‌ర్ధి డిఫెండ‌ర్ల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే. మణిందర్ సింగ్ ఖాతాలో 1,428 పాయింట్లు ఉన్నాయి. అత‌డి ఖాతాలో 
జైపూర్ పింక్ పాంథర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement