
యూఏఈ వేదికగా త్వరలో జరుగనున్న ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 17) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించినట్లుగానే స్టార్ ఆటగాళ్లుగా చెప్పుకునే బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. వేటు పడుతుందని భావించిన మరో స్టార్ షాహీన్ అఫ్రిది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.
పాక్ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు పెద్ద పీఠ వేశారు. రిజ్వాన్ స్థానంలో మహ్మద్ హరీస్ వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ లాంటి గుర్తింపు ఉన్న ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కింది.
పాక్ సెలెక్టర్లు ఇదే జట్టుకు ఆసియా కప్‌కు ముందు యూఏఈలోనే జరిగే ట్రై సిరీస్‌కు కూడా ఎంపిక చేశారు. ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే ఈ ట్రై సిరీస్‌లో పాక్‌తో పాటు ఆతిథ్య జట్టు యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆసియా కప్ ప్రారంభమవుతుంది (సెప్టెంబర్ 9-28 వరకు). ఈ ఖండాంతర టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. పాక్, భారత్.. ఒమన్, యూఏఈతో కలిసి ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి.
ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరో రెండు మ్యాచ్‌లకు కూడా ఆస్కారం ఉంది. అయితే ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుందా లేదా అన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. పహల్గాం దాడి తర్వాతి పరిణామాల్లో భారత్ పాక్‌ను అన్ని విషయాల్లో వెలి వేసింది. క్రికెట్ సహా అన్ని రంగాల్లో పాక్‌ను బహిష్కరించింది.
ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో భారత్ పాక్‌తో మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసింది. ఆసియా కప్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. భారతీయులంతా పాక్‌తో ఏ విషయంలోనూ సంబంధాలు కోరుకోవడం లేదు.
ట్రై సిరీస్, ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్