ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. 43 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్‌ | Ollie Robinson Equals Kapil Devs 43-Year-Old Record Vs Pakistan | Sakshi
Sakshi News home page

ENG vs PAK: ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. 43 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్‌

Aug 19 2026 4:58 PM | Updated on Aug 19 2026 5:55 PM

Ollie Robinson Equals Kapil Devs 43-Year-Old Record Vs Pakistan

ఇంగ్లండ్‌-పాకిస్తాన్ మ‌ధ్య తొలి టెస్టు లీడ్స్ వేదిక‌గా ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ తొలుత పాక్‌ను బ్యాటింగ్  అహ్హ‌నించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ త‌గిలింది. మొద‌టి బంతికే పాక్ ఓపెన‌ర్ అజాన్ అవైస్‌ను ఇంగ్లండ్ స్టార్ పేస‌ర్ ఓలీ రాబిన్సన్ పెవిలియన్‌కు పంపాడు. 

యువ ఆట‌గాడు అవైస్‌కు రాబిన్స‌న్‌ ఆఫ్ స్టంప్ అవతల గుడ్-లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే బంతి పిచ్ అయిన తర్వాత ఎక్కువ‌గా స్వింగ్ అవుతూ లోప‌ల‌కు వ‌చ్చి నేరుగా అవైస్‌ ఫ్రంట్ ప్యాడ్‌ను తాకింది. వెంట‌నే ఎల్బీకి అప్పీల్ చేయ‌గా అంపైర్ అవుట్ అని వేలు పైకెత్తాడు. 

బ్యాటర్ రివ్యూ తీసుకున్నప్పటికి  ఆల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను తాకలేదని స్పష్టమవ్వడంతో అతడు డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాబిన్సన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో మొదటి బంతికే పాక్ బ్యాటర్‌ను అవుట్ చేసిన రెండో బౌలర్‌గా రాబిన్సన్ నిలిచాడు. 

అంతకుముందు 1983లో జలంధర్ వేదికగా జరిగిన ఓ టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ మొహ్సిన్ ఖాన్‌ను కపిల్ దేవ్ తొలి బంతికే అవుట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు 43 ఏళ్ల తర్వాత రాబిన్సన్ ఈ ఫీట్‌ నమోదు చేయడం విశేషం. 

ఓవరాల్‌గా తొలి బంతికే వికెట్ తీసిన ఆరో ఇంగ్లండ్ బౌలర్ ఓలీ నిలిచాడు. కాగా రాబిన్సన్ ధాటికి పాక్ రెండో వికెట్ కూడా కోల్పోయింది. 23 పరుగులకే 2  వికెట్లు కోల్పో‍యి పర్యాటక జట్టు కష్టాల్లో పడింది. అయితే వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో 9.4 ఓవర్ల వద్ద ఆటను అంపైర్‌లు నిలిపివేశారు.
చదవండి: IND vs SL: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన లంక కెప్టెన్!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement