
Nisha Dahiya Refuses Her Death Reports.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, జాతీయ స్థాయి మహిళ రెజ్లర్.. నిషా దహియా చనిపోయిందన్న వార్తల్లో నిజం లేదు. హర్యానాలోని సోనిపట్‌లోని సుశీల్ కుమార్ అకాడమీలో జరిగిన కాల్పుల్లో నిషా దహియా, అతని సోదరుడుడ చనిపోయిందంటూ బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నిషా దహియా స్వయంగా ట్విటర్ ద్వారా స్పందించింది. '' నేను చనిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నాను. అది ఫేక్ న్యూస్.. ఆ వార్త నమ్మకండి'' అంటూ కామెంట్ చేసింది.